కోడికూర కోసం గొడవ.. కొడుకును దారుణంగా హత్య చేసిన తండ్రి
- కర్ణాటకలో తాజాగా వెలుగు చూసిన ఉదంతం
- కొడుకు ఇంటికొచ్చేలోపే కోడి కూర తినేసిన తండ్రి
- తనకు కూర ఎందుకు మిగల్చలేదంటూ తండ్రితో కొడుకు వాగ్వాదం
- క్షణికావేశంలో కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి
కుటుంబ బంధాలు బలహీనమవుతున్న నేటి ఆధునిక సమాజంలో చిన్న చిన్న తగాదాలు కూడా అనూహ్య పరిణామాలకు దారి తీస్తున్నాయి. కోడి కూర విషయంలో తలెత్తిన వివాదంతో ఓ కుటుంబంలో హత్య జరిగింది. కర్ణాటకలో వెలుగుచూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. షీనా అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి దక్షిణ కన్నడ జిల్లాలోని సూలీయా తాలూకా గుత్తిగర్ గ్రామంలో నివసిస్తుంటాడు. మంగళవారం ఇంట్లో వండిన కోడి కూర మొత్తాన్ని షీనా తినేశాడు. ఆ తరువాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్‌కు విషయం తెలిసి తండ్రితో గొడవపడ్డాడు.
ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్ ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివరామన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది.