భారత్ అభ్యంతరాలను లెక్కచేయని చైనా
- అరుణాచల్ ప్రదేశ్‌పై మళ్లీ తన సార్వభౌమత్వాన్ని ప్రదర్శించిన చైనా
- తమ చట్టాలకు లోబడే పేరుమార్పు చేపట్టామని వ్యాఖ్య
- అరుణాచల్‌ప్రదేశ్ చైనాలో అంతర్భాగమన్న ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి
భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లు మార్చిన చైనా తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పేరుమార్పుపై భారత్ అభ్యంతరాలను లెక్క చేయకుండా అరుణాచల్‌ప్రదేశ్‌పై తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుంది.
మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి అరుణాచల్ ప్రదేశ్ తమ దేశానిదేనని చెప్పుకొచ్చారు. ‘‘జాంగ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్‌కు చైనా పెట్టుకున్న పేరు) చైనా భూభాగమే. చైనా చట్టాలను అనుసరించి జాంగ్నాన్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చాం. చైనా సార్వభౌమ హక్కులకు లోబడే ఇలా చేశాం’’ అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. ఆరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్జీ మంగళవారం స్పష్టం చేశారు.