విష్వక్సేన్ హీరోగా రవితేజ సొంత సినిమా!

  • ఇటీవలే సొంత బ్యానర్ ను సెట్ చేసిన రవితేజ
  • తన సినిమాలకు ఆయన నిర్మాణ భాగస్వామి
  • ఇకపై ఇతర హీరోలతో సినిమాలు చేసే ఆలోచన
  • ముందుగా తెరపైకి వచ్చిన విష్వక్ పేరు 
హీరోగా రవితేజ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆయన నుంచి రావడానికి 'రావణాసుర' సినిమా రెడీ అవుతోంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవితేజ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. ఇంతకుముందు కూడా తన సినిమాలలో కొన్నిటికి ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

అయితే ఇకపై బయట హీరోలతో కూడా తన బ్యానర్లో సినిమాలు చేయాలనే ఒక ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. నాని మాదిరిగానే మినిమమ్ గ్యారెంటీ ఉన్న ఇతర హీరోలతో .. ఓ మాదిరి బడ్జెట్ లో సినిమాలు నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. 

తన కోసం వచ్చిన ఒక కథ ..  తనకంటే విష్వక్ కి బాగా సెట్ అవుతుందని భావించిన రవితేజ, ఆయనను లైన్లో పెడుతున్నాడని అంటున్నారు. ఆ కథతో తన దగ్గరికి వచ్చిన యువ దర్శకుడితోనే ఆయన ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. 


More Telugu News