విచారణ పేరుతో రామోజీరావును వేధించడం విచారకరం.. నాగబాబు వరుస ట్వీట్లు
- సామాజిక మాధ్యమాల్లో ఆయనపై కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్న నాగబాబు
- తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటిచెప్పారని ప్రశంస
- మీడియా, సినీ రంగాల్లో వేలాదిమందికి జీవనాధారం కల్పించారన్న జనసేన నేత
విచారణ పేరుతో రామోజీరావును వేధించడం విచారకరమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కె.నాగబాబు అన్నారు. రామోజీరావును, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం సరికాదన్నారు. రామోజీరావుపై సామాజిక మాధ్యమాల్లో కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధిని తీసుకొచ్చి వేలాదిమందికి ఆయన జీవనాధారం కల్పించారని ప్రశంసించారు. కళారంగంలో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన రామోజీరావు తెలుగు ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పారని అన్నారు. పద్మవిభూషణ్ రామోజీరావు లక్షల మందికి ఆదర్శప్రాయులని కొనియాడారు. సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు నాగబాబు ట్వీట్ చేశారు.