సీఎం జగన్ కాలికి గాయం.. రేపటి ఒంటిమిట్ట పర్యటన రద్దు
- ఏప్రిల్ 5న ఒంటిమిట్టలో రాములవారి కల్యాణోత్సవం
- పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉన్న సీఎం జగన్
- ఉదయం వ్యాయామం చేస్తుండగా బెణికిన కాలు
- ప్రయాణాలు చేయరాదన్న వైద్యులు
ఏపీ సీఎం జగన్ రేపు కడప జిల్లా ఒంటిమిట్ట వెళ్లాల్సి ఉండగా, కాలికి గాయం కావడంతో ఆ పర్యటన వాయిదా పడింది. సీఎం జగన్ ఈ ఉదయం వ్యాయామం చేస్తుండగా కాలు బెణికింది. నొప్పి ఎంతకీ తగ్గకపోగా, సాయంత్రానికి అధికమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో రేపు ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకున్నారు. సీఎం జగన్ కు గతంలోనూ ఇలాగే కాలికి గాయం కావడం తెలిసిందే.
ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 5న సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయానికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని భావించారు. అధికారులు కూడా అందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కాలు బెణకడంతో పర్యటన రద్దు కాగా, ఆ మేరకు అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.