మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

  • మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ విచారణ
  • 30 మంది మేనేజర్లకు నోటీసులు
  • నిన్న రామోజీరావును ప్రశ్నించిన సీఐడీ అధికారులు
  • తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు
మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ విచారణ జరుపుతున్న ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది. 

ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ ఇప్పటికే 30 మంది మేనేజర్లకు నోటీసులు ఇచ్చింది. నిన్న రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును కూడా సీఐడీ అధికారులు విచారించారు. 

ఈ నేపథ్యంలో, సీఐడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రామోజీరావు ఆరోగ్య పరిస్థితిని, ఆయనను విచారించిన తీరును పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, సీఐడీ కస్టడీలో ఉన్న మార్గదర్శి ఆడిటర్ కు గాయాలయ్యాయని తెలిపారు.


More Telugu News