వెంట పడ్డ వీధి కుక్కలు.. కారును ఢీకొట్టిన స్కూటర్

  • ఒడిశా రాష్ట్రం బెర్హంపూర్ పట్టణంలో చోటు చేసుకున్న ఘటన
  • కుక్కలు వెంటాడడంతో భయపడిపోయిన మహిళలు
  • వాటిని చూస్తూ వేగంగా పోనీయడంతో అదుపు తప్పిన స్కూటర్
వీధి కుక్కల బెడద పట్టణాల్లో విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేందుకు ఎన్నో ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేట ప్రాంతంలో వీధి కుక్కల గుంపు ఓ బాలుడిపై దాడి చేయగా, చిన్నారి మరణించడం తెలిసిందే. వీధి కుక్కలు ఎంతో మందిని కరుస్తున్న ఘటనలు కూడా చూస్తున్నాం. ఇక ద్విచక్ర వాహన దారులను కుక్కలు వెంటాడడం చాలా మందికి అనుభవమే. ఇలాంటి ఘటనే ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బెర్హంపూర్ పట్టణంలోనూ చోటు చేసుకుంది.

వీధి కుక్కలు వెంట పడగా, స్కూటర్ పై వెళుతున్న మహిళలు భయపడిపోయి నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ స్కూటర్ ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ ముందు భాగంలో కూర్చున్న బాలుడు, స్కూటర్ పై ఉన్న ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. గాయాలతో వారు బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత కుక్కుల గుంపు అక్కడి నుంచి పరారైంది. కుక్కలకు భయపడిపోకుండా వాహనాన్ని నిలిపివేసి, కిందకు దిగితే భయంతో అవే పారిపోతాయి. కానీ, చాలా మంది భయంతో వాహనాన్ని వేగంగా ముందుకు పోనిస్తుంటారు. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయని గ్రహించాలి.


More Telugu News