కుక్క కాట్లపై షాకింగ్ రిపోర్టు బయటపెట్టిన ఐసీఎంఆర్
- దేశంలో కోటి 53 లక్షల వీధి కుక్కలు ఉన్నాయన్న ఐసీఎంఆర్
- ఏడాదికి 2 కోట్ల మందిని కరుస్తున్నట్లు వెల్లడి
- 18 వేల నుంచి 20 వేల మంది రేబిస్ వైరస్ వల్ల చనిపోతున్నారని రిపోర్ట్
దేశంలో కుక్క కాట్లపై షాకింగ్ నిజాలను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బయటపెట్టింది. ఏటా 2 కోట్ల మంది కుక్క కాట్లకు గురవుతున్నట్లు వెల్లడించింది. దేశంలో 18 వేల నుంచి 20 వేల మంది రేబిస్ వైరస్ బారిన పడి చనిపోతున్నట్లు తెలిపింది. తాజాగా ఇందుకు సంబంధించిన రిపోర్టును విడుదల చేసింది.
దేశంలో ఒక కోటి 53 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందని ఐసీఎంఆర్ చెప్పింది. ఏడాదికి 2 కోట్ల కుక్క కాట్లు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ సంఖ్యను రోజులు.. గంటలు.. నిమిషాల లెక్కన విభజిస్తే షాకింగ్ నిజాలు వెల్లడవుతున్నాయి. సగటున రెండు సెకన్లకు ఒకరిని కుక్కలు కరుస్తుండగా.. అర గంటకు ఒకరు చొప్పున చనిపోతున్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న రేబిస్ మరణాల్లో 36 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. మన దేశంలో ఉన్న కుక్కల్లో 70 శాతం ఎవరూ పట్టించుకోని వీధి కుక్కలేనని పేర్కొంది. దేశంలో ముఖ్యంగా హాస్పిటళ్ల ఆవరణలో కుక్కల బెడద ఎక్కువవడం.. పేషెంట్లు, డాక్టర్లపై కుక్కలు దాడి చేయడం వంటి ఘటనలు పెరిగాయని వెల్లడించింది.