గూగుల్ వర్క్‌స్పేస్‌కు ఏఐ సొబగులు.. కొత్త ఫీచర్లు అదుర్స్!
- మైక్రోసాఫ్ట్‌కు పోటీగా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న గూగుల్
- గూగుల్ వర్క్ స్పేస్ ఉత్పత్తులకు ఏఐ సొబగులు
- ప్రయోగత్మాకంగా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన గూగుల్
గూగుల్ తన వర్క్‌స్పేస్ ఉత్పత్తులకు ఏఐ సొబగులను అద్దింది. జీమెయిల్, డాక్స్, మ్యాప్స్ వంటి యాప్స్‌కు కృత్రిమ మేథ సామర్థ్యాలను జోడించింది. దీంతో..యూజర్లు మరింత సులువుగా తమ పనులను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. తాజాగా మార్పులతో వినియోగదారులు మరింత సులువుగా మెయిల్స్ రాసుకునేందుకు, రిప్లై ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా.. తమ ప్రజెంటేషన్లు మరింత ప్రొఫెషనల్‌గా కనిపించేలా తీర్చిదిద్దుకోవచ్చు. ఈదిశగా స్మార్ట్ కంపోజ్, స్మార్ట్ రిప్లై, సమ్మరీల తయారీ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఓ కొత్త యుగానికి నాంది పలుకుతున్నట్టు పేర్కొంది.
తాజా ఫీచర్ల సాయంతో యూజర్లు..
తాజా ఫీచర్ల సాయంతో యూజర్లు..
- ఈ మెయిల్ ఎలా రాయాలన్న దానిపై గుగూల్ సలహాలు తీసుకోవచ్చు. ఏఐ ఆధారంగా గూగుల్ సూచించే టెంప్లేట్ల నుంచి తమకు నచ్చిన ఈమెయిల్‌ను ఎంచుకోవచ్చు.
- గూగుల్ డాక్స్‌లో రాసుకున్న అంశాలను ఏఐ సాయంతో క్షుణ్ణంగా తనఖీ చేసుకుని తప్పులు సరిదిద్దుకోవచ్చు
- ఇక ఏఐ అందించే ఆటోమెటిక్ ఇమేజెస్, ఆడియో, వీడియోలతో ప్రెజెంటేషన్‌లను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దవచ్చు
- ఏఐ సాయంతో గూగుల్ షీట్స్‌లోని డాటాను క్రోడీకరించి వర్గీకరించి, విశ్లేషించే వెసులుబాటు కూడా గూగుల్ కల్పించింది
- గూగుల్ మీట్‌లో బ్యాక్‌గ్రౌండ్ మార్చుకునే అవకాశం మరో అద్భుతమైన ఫీచర్. మీట్‌లో నోట్స్ సులభకరంగా తీసుకునేందుకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.