డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎస్ఎస్ సీ నోటిఫికేషన్ విడుదల
- సోమవారం నుంచే మొదలైన దరఖాస్తు ప్రక్రియ.. మే 3 వరకు అవకాశం
- గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు
- గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు.. రిజర్వేషన్ ఆధారంగా మినహాయింపులు
కేంద్ర ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రకటన జారీ చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 3 లోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు..
ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో.. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
ఇంటలిజెన్స్ బ్యూరోలో.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు
సీబీడీటీలో.. ఇన్ కంట్యాక్స్ ఇన్ స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్
సీబీఐలో.. సబ్ ఇన్ స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్
ఎన్ హెచ్ఆర్ సీలో.. రీసెర్చ్ అసిస్టెంట్
ఎన్ఐఏలో.. సబ్ ఇన్ స్పెక్టర్
నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో.. సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
కాగ్ లో.. ఆడిటర్, అకౌంటెంట్
తపాలా శాఖలో.. పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
ఆర్థిక మంత్రిత్వ శాఖలో.. సబ్ ఇన్ స్పెక్టర్
వేతనం: పోస్టులను బట్టి నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100
వయో పరిమితి: కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ఠంగా 32 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడేళ్లు సడలింపు)
దరఖాస్తు రుసుము: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు)
ఎంపిక జరిగేదిలా..: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (రెండు దశలుగా). టైర్ 1 పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. టైర్ 2 పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. రెండు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు
ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ: మే 4 రాత్రి 11 గంటల వరకు
దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు మే 7 నుంచి మే 8 వరకు అవకాశం
టైర్ 1 పరీక్ష జులైలో, టైర్ 2 పరీక్ష తేదీలు తర్వాత ఖరారు చేస్తారు
పరీక్షా కేంద్రాలు
తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లింక్..