ధోనీ సిక్సర్ల మోతకు బిక్క మొహం వేసిన గంభీర్
- ధోనీ ఎదుర్కొన్నది కేవలం మూడు బంతులే
- రెండు సిక్సర్లు బాదడంతో వాడిపోయిన గంభీర్ ముఖం
- గంభీర్ పరిస్థితిపై నెజిజన్లు కామెంట్ల రూపంలో విమర్శలు
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జీ) జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. నవ్వొచ్చినా, కోపం వచ్చినా గంభీర్ నియంత్రించుకోలేడు. చెన్నై జట్టు, లక్నో జట్టు మధ్య సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఇది మరోసారి నిరూపితమైంది. చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చి కేవలం మూడు బంతులే ఆడి మళ్లీ పెవిలియన్ చేరాడు.
కానీ, ధోనీ క్రీజులో ఉన్న సమయంలో ఎదుర్కొన్న మూడు బంతుల్లో రెండింటిని అద్భుతమైన సిక్సర్లుగా మలిచాడు. ఆ సమయంలో చెన్నై జట్టు సభ్యులు కేరింతలు కొడుతుంటే.. గౌతమ్ గంభీర్ మొహం ఎండకు వాడిపోయిన ఆకు మాదిరిగా తయారైంది. దిగాలుగా కూర్చున్న మాదిరిగా గంభీర్ కనిపించాడు. ఈ మ్యాచ్ లో చివరికి చెన్నై జట్టు 12 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించడం తెలిసిందే. గంభీర్ పరిస్థితిపై నెటిజన్లు తెగ ఆడిపారేసుకున్నారు. గంభీర్ పరిస్థితి ఇదంటూ రకరకాల ట్వీట్లు, వీడియోలను ట్రోల్ చేశారు.