సిద్ధిపేట అదనపు కలెక్టర్ కు కుక్క కాటు
- తన క్వార్టర్స్ ముందు వాకింగ్ చేస్తుండగా దాడి చేసిన శునకం
- కలెక్టరేట్ లో బీభత్సం సృష్టిస్తున్న వీధి కుక్కలు
- మరో ఇద్దరు సిబ్బందిపైనా దాడి చేసి గాయపరిచిన వైనం
సిద్దిపేట కలెక్టరేట్ లో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ దాడి చేస్తుండడంతో కలెక్టరేట్ ఆవరణలో తిరగాలంటే ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని కరిచిన కుక్కలు తాజాగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డిపైనా దాడి చేసి కరిచాయి. తన క్వార్టర్స్ ముందు వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ దాడిలో పెంపుడు శునకం కూడా గాయపడిందని తెలిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుక్క దాడిలో శ్రీనివాస్ రెడ్డి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో సిబ్బంది వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదనపు కలెక్టర్ ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, శ్రీనివాస్ రెడ్డిని గాయపరిచిన రోజే మరో ఇద్దరు కూడా కుక్క కాటుకు గురయ్యారని అధికారులు తెలిపారు. కలెక్టరేట్ కు దగ్గర్లోని పౌల్ట్రీఫాం వద్ద ఓ బాలుడిపైనా వీధి కుక్క దాడి చేసిందని వివరించారు.