అమరావతి ఆర్-5 జోన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

  • అమరావతి వెలుపల ఉన్న పేదలకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ
  • ఇక్కడి భూములను రాజధాని అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు
  • కేసును విచారించనున్న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం
ఏపీ రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్ పై హైకోర్టులో కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. అమరావతి వెలుపల ఉన్న పేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేస్తూ నిన్న ఏపీ ప్రభుత్వం జీవో 45ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం రాజధాని ప్రాంతంలోని 1,134 ఎకరాలను కేటాయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసును ఈ ఉదయం తొలి కేసుగా స్వీకరించనుంది. 

అమరావతి భూములను రాజధాని అవసరాలకు మాత్రమే వినియోగించాలని, ఇతర అంశాలకు ఉపయోగించకూడదని ఇప్పటికే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికీ కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు సంబంధించి జీవోను జారీ చేసింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరపున వాదించేందుకు ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులు హైకోర్టుకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.


More Telugu News