త్వరలో యాపిల్‌‌లోనూ లేఆఫ్స్!

  • యాపిల్ లేఆఫ్స్‌కు సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ వార్తాపత్రిక కథనం
  • స్వల్ప స్థాయిలోనే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని వెల్లడి
  • డెవలప్‌మెంట్ అండ్ ప్రిజర్వేషన్ విభాగంలో తొలగింపుల పర్వం
అంతర్జాతీయ టెక్ సంస్థలు అనేకం తమ ఉద్యోగులను తొలగించినా యాపిల్ సంస్థ మాత్రం లేఆఫ్స్ వాయిదా వేస్తూ వచ్చింది. అయితే.. ఇకపై  యాపిల్‌లోనూ పరిస్థితులు మారుతున్నాయి. యాపిల్ యాజమాన్యం కూడా లేఆఫ్స్ దిశగా యోచినస్తున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ తాజాగా ప్రచురించింది. స్వల్ప సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుందని పేర్కొంది. సంస్థలోని డెవలప్‌మెంట్ అండ్ ప్రిసర్వేషన్ విభాగంలో ఈ తొలగింపులు ఉంటాయని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది. అయితే.. మొత్తం ఎంతమందిని తొలగించబోతున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.  ఈ కథనంపై అంతర్జాతీయ వార్తా సంస్థలు యాపిల్‌ను సంప్రదించగా సంస్థ నుంచి స్పందన లేదని సమాచారం. 

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో ఆర్థిక రంగం నెమ్మదిస్తుందన్న భయాందోళనలు అమెరికా కార్పొరేట్ రంగంలో వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికాలోని పలు భారీ కార్పొరేట్ సంస్థలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. ఫేస్‌బుక్‌లో మరో 10 వేల మందిని తొలగించబోతున్నట్టు సంస్థ యాజమాన్యం గతనెలలోనే ప్రకటించింది. ఓ భారీ టెక్ కంపెనీ ఇలా రెండో మారు లేఆఫ్స్ చేపట్టేందుకు రెడీ కావడం అప్పట్లో మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది.


More Telugu News