నో బాల్స్ వేశారనుకోండి.. జాగ్రత్త: బౌలర్లకు ధోనీ సీరియస్ వార్నింగ్!
- ప్రత్యర్థి బౌలర్లపై ఓ కన్నేసి ఉంచాలన్న ధోనీ
- నో బాల్స్, వైడ్లు వేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరిక
- ఫాస్ట్ బౌలింగులో మరింత మెరుగుపడాల్సి ఉంటుందని సూచన
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తమ బౌలర్లను తీవ్రంగా హెచ్చరించాడు. లక్నో సూపర్ కింగ్స్‌తో గత రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు బౌలర్లతో ధోనీ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలింగులో మనం మరింత మెరుగుపడాల్సి ఉందన్నాడు. పరిస్థితులను బట్టి బౌలింగ్ చేయాలని సూచించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఓ కన్నేసి ఉంచాలని, వారేం చేస్తున్నారో పరిశీలించాలని అన్నాడు. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. నోబాల్స్, వైడ్లు వేయొద్దని, ఒకవేళ వేస్తే కనుక కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాడు. ఇది తన రెండో హెచ్చరిక అని, ఆ తర్వాత తాను తప్పుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.
ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్‌పైనా ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐదారు సంవత్సరాల తర్వాత తొలిసారి ఈ పిచ్‌పై ఆడుతున్నట్టు చెప్పాడు. పిచ్ చాలా నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పాడు. ఇక్కడ మంచి స్కోర్ చేయగలమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ (57) డెవోన్ కాన్వే (47) పరుగులతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం కొండంత లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.