మంత్రివర్గంలో జగన్ మార్పులు చేయబోతున్నారనే వార్తలపై అంబటి రాంబాబు స్పందన
- గడపగడపకు కార్యక్రమంలో గ్రాఫ్ బాగోలేని వారిని తప్పుకోవాలని చెప్పే అవకాశం ఉందన్న అంబటి
- మంత్రివర్గంలో మార్పులు ఉండకపోవచ్చని వ్యాఖ్య
- మంత్రివర్గం మార్పుకు సంబంధించి తన వద్ద సమాచారం లేదన్న అంబటి
ఏపీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి జగన్ మార్పులు చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గడపగడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. పనితీరు బాగోలేని వారిని, గ్రాఫ్ బాగోలేని వారిని ముందే తప్పుకోవాలని చెప్పే అవకాశం ఉందని అన్నారు. మంత్రివర్గంలో మార్పులు చేసే అంశానికి సంబంధించిన సమాచారం తన వద్ద లేదని చెప్పారు.
ఈ టైమ్ లో మార్పులు ఉంటాయని తాను భావించడం లేదని అన్నారు. 'జగనన్న మా భవిష్యత్తు' కార్యక్రమం ఈ నెల 7 నుంచి కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు ఈ కార్యక్రమమే ప్రధాన అజెండాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు.