అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమా.. పాట కోసం రూ. 5 కోట్లతో భారీ సెట్
- బాలయ్య, శ్రీలీలపై సాంగ్ చిత్రీకరణ
- బాలయ్య కెరియర్‌లోనే అత్యధిక వ్యయంతో పాట చిత్రీకరణ
- తమన్ బాణీలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ
- దసరాకు విడుదలకానున్న సినిమా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ‘ఎన్‌బీకే 108’గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమాలో గణేశుడిపై సాగే పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 5 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. అందులో బాలయ్య, శ్రీలీలపై పాటను చిత్రీకరిస్తున్నారు. బాలయ్య కెరియర్‌లోనే అత్యధిక ఖర్చుతో తెరకెక్కుతున్న పాట ఇదేనని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ పాటకు తమన్ బాణీలు సమకూర్చగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకు విడుదల కానుంది.