స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో పీవీ సింధు ఓటమి
- ఇండోనేషియాకు చెందిన టుంజుంగ్ చేతిలో ఓటమి
- వరుస గేముల్లో పరాజయం పాలైన సింధు
- గతంలో ఇరువురి మధ్య ఏడు మ్యాచ్ లు... అన్నింటా సింధుదే విజయం
- ఇవాళ చరిత్ర తిరగరాసిన ఇండోనేషియా షట్లర్
భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధు మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో రన్నరప్ గా నిలిచింది. మాడ్రిడ్ లో ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓటమి పాలైంది. ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా టుంజుంగ్ చేతిలో 8-21, 8-21తో సింధు వరుస గేముల్లో పరాజయం చవిచూసింది.
ఈ టైటిల్ పోరులో సింధు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనిస్తున్నట్టు కనిపించలేదు. సింధు ఆటతీరులో చురుకుదనం లోపించింది. దాంతో, ఇండోనేషియా షట్లర్ టుంజుంగ్ మరింత విజృంభించింది. సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు సింధు, టుంజుంగ్ ఏడుసార్లు పరస్పరం తలపడ్డారు. ఈ ఏడు పర్యాయాలూ సింధునే గెలిచింది. ఇవాళ ఫైనల్లోనూ సింధుదే విజయం అని అందరూ భావించారు. కానీ గత రికార్డును పట్టించుకోకుండా టుంజుంగ్ విజృంభించి ఆడింది.