39 పరుగులకే 4 వికెట్లు డౌన్... కష్టాల్లో సన్ రైజర్స్

  • రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ మ్యాచ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసిన రాయల్స్
  • ఛేజింగ్ లో సన్ రైజర్స్ ను దెబ్బతీసిన ట్రెంట్ బౌల్ట్
  • హ్యారీ బ్రూక్ వికెట్ ను ఖాతాలో వేసుకున్న చహల్
సొంతగడ్డపై ఐపీఎల్-16 ప్రస్థానం ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఛేజింగ్ లో కష్టాలు ఎదురయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ విసిరిన 204 పరుగుల లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ 8.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటికి స్కోరు 39 పరుగులే. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బౌల్ట్.. అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠి (0)లను డకౌట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. 

ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (13) ను చహల్ ఓ అద్భుతమైన ఫ్లిప్పర్ తో బోల్తా కొట్టించాడు. ఆ బంతి సుడులు తిరుగుతుండడంతో టర్న్ అవుతుందని భావించిన బ్రూక్.. నేరుగా రావడంతో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జాసన్ హోల్డర్ విసిరిన బంతికి వాషింగ్టన్ సుందర్ అవుటయ్యాడు. భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చాడు. 

మరో ఎండ్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పోరాడుతున్నాడు. ప్రస్తుతం 8.2 ఓవర్ల అనంతరం సన్ రైజర్స్ స్కోరు 4 వికెట్లకు 38 పరుగులు. ఆ జట్టు నెగ్గాలంటే 70 బంతుల్లో 165 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లున్నాయి. మయాంక్ అగర్వాల్ (24 బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్ (0 బ్యాటింగ్) ఉన్నారు.


More Telugu News