చివర్లో కోలుకున్న సన్ రైజర్స్... టార్గెట్ 204 రన్స్
- ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్
- టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్
- రాజస్థాన్ రాయల్స్ కు బ్యాటింగ్
- దంచికొట్టిన బట్లర్, జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ ధాటికి బెంబేలెత్తిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చివరి ఓవర్లలో కాస్త పుంజుకున్నారు. ఓ దశలో రాజస్థాన్ జట్టు 250 పైచిలుకు స్కోరు సాధిస్తుందని అనిపించినా... ఫజల్ హక్ ఫరూఖీ 2, నటరాజన్ 2, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీసి కొద్దిమేర కట్టడి చేశారు. దాంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 54, జోస్ బట్లర్ 54, కెప్టెన్ సంజు శాంసన్ 55, షిమ్రోన్ హెట్మెయర్ 22 (నాటౌట్) రాణించారు. దేవదత్ పడిక్కల్ (2), రియాన్ పరాగ్ (7) విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే.