ఉద్యోగ అభ్యర్థులు ప్రతిపక్షాల వలలో పడి సమయం వృథా చేసుకోవద్దు: హరీశ్ రావు

  • ఇటీవల టీఎస్ పీఎస్సీలో పేపర్ లీక్
  • పేపర్ లీక్ దురదృష్టకరమన్న హరీశ్ రావు
  • విపక్షాలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని వెల్లడి
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం దురదృష్టకరం అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. పేపర్ లీక్ ను ప్రభుత్వమే గుర్తించిందని, ప్రతిపక్షాలు కాదని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగ అభ్యర్థులు ప్రతిపక్షాల వలలో పడి సమయం వృథా చేసుకోవద్దని హరీశ్ రావు హితవు పలికారు. విపక్షాలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని వ్యాఖ్యానించారు. 

ప్రతిపక్షాలు చెప్పే మాటల్లో ఒక్కటైనా నిజం ఉందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపునిచ్చారు. రద్దయిన, వాయిదాపడిన పరీక్షలు మళ్లీ నిర్వహించి అర్హులందరికీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 6 నెలల్లో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.


More Telugu News