సొంతగడ్డపై టాస్ గెలిచిన సన్ రైజర్స్... అందరి దృష్టి అతడిపైనే!
- ఐపీఎల్-16లో నేడు డబుల్ హెడర్
- తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- ఇరుజట్లలోనూ స్టార్ ఆటగాళ్లు
- మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం
ఐపీఎల్-16లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను నేడు రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ తాత్కాలిక సారథి భువనేశ్వర్ కుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఉప్పల్ స్టేడియం పిచ్ సన్ రైజర్స్ కు అలవాటైనదే కాబట్టి చేజింగ్ కు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ ఈ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో బ్రూక్ వరుస సెంచరీలతో హోరెత్తించాడు. దాంతో ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ అతడిని రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. నేటి మ్యాచ్ ద్వారా బ్రూక్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. దాంతో అందరి దృష్టి అతడిపైనే ఉండనుంది.
ఇక, ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే... సన్ రైజర్స్ లో హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ రాణిస్తే ఎలాంటి బౌలర్లకైనా కష్టమే.
బౌలింగ్ లో కెప్టెన్ భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్ లతో కూడిన బలమైన పేస్ దళం సన్ రైజర్స్ సొంతం. ఆఫ్ఘనిస్థాన్ లెఫ్టార్మ్ సీమర్ ఫజల్ హక్ ఫరూఖీ కూడా రాణిస్తే అది బోనస్ అవుతుంది. ఇక స్పిన్ లోనూ ఎస్ఆర్ హెచ్ టీమ్ కు మెరుగైన వనరులే ఉన్నాయి. ఇంగ్లండ్ స్టార్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఈ సీజన్ లో హైదరాబాద్ టీమ్ కు ఆడుతున్నాడు.
అటు, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ చూస్తే భీకరంగా కనిపిస్తోంది. విధ్వంసక బ్యాటింగ్ కు మారుపేరులా నిలిచి జోస్ బట్లర్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, హెట్మెయర్, రియాన్ పరాగ్ లకు బౌలింగ్ చేయడం నేటి మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలింగ్ సత్తాకు పరీక్ష కానుంది. బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, చహల్ రాజస్థాన్ కు అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ లో హోరాహోరీ తప్పదనిపిస్తోంది.
సన్ రైజర్స్ హైదరాబాద్...
భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, అదిల్ రషీద్, టి.నటరాజన్, ఫజల్ హక్ ఫరూఖీ.
రాజస్థాన్ రాయల్స్...
సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యజువేంద్ర చహల్.