జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి కేటీఆర్ లేఖ
- స్వాగతించిన లక్ష్మీనారాయణ
- జగన్ కూడా ఇదే వైఖరి తీసుకోవాలని సూచన
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాయడం ఆసక్తికర అంశంగా మారింది. విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే కుట్రలు ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కేటీఆర్ స్పందన హర్షణీయం అని తెలిపారు. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకుంటే... ముడిసరుకు సరఫరా, వర్కింగ్ క్యాపిటల్ ను అందించే బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనాలని లక్ష్మీనారాయణ సూచించారు. కేటీఆర్ తరహాలో వైఎస్ జగన్ కూడా ఇదే వైఖరి తీసుకోవాలని ప్రార్థన అంటూ ట్వీట్ చేశారు.