తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలు ఓపెన్
- 2023-24 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు
- ఈ ఏడాదిలో విద్యార్థులకు 77 రోజులు సెలవులు
- 2024 మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు
రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలు జూన్ 1 న తెరుచుకుంటాయని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది ఇంటర్ విద్యాసంస్థలకు 77 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. 365 రోజుల్లో 77 సెలవులు మినహా 227 రోజులు క్లాసులు జరుగుతాయని వివరించింది. ఈమేరకు 2023-24 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన క్యాలెండర్ ను బోర్డు అధికారులు విడుదల చేశారు.
అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులతో పాటు ఆదివారాలు సహా మొత్తం 77 సెలవు దినాలను బోర్డ్ ప్రకటించింది. ఫిబ్రవరి 2వ వారంలో ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ అధికారులు వెల్లడించారు. కాగా, కిందటి నెలలో ఇంటర్ వార్షిక పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. మార్చి 30 నుంచి మే 31 వరకు ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు.