భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు

  • దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,824 కరోనా కేసులు
  • రోజూవారీ కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల
  • కరోనా కట్టడికి నడుం కట్టిన రాష్ట్రాలు
భారత్‌లో రోజువారి కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 3,824 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,389కు చేరింది. ఇక గత 24 గంటల్లో 1,784 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4,41,73,335కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.77 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, డెయిలీ పాజిటివిటీ రేటు 2.27 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. 

ఇటీవల కాలంలో భారత్‌లో రోజువారి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి కట్టడి చర్యలు ప్రారంభించాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, హరియాణాతో పాటూ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో శనివారం కొత్తగా 400 కేసులు వెలుగులోకి రాగా మహారాష్ట్రలో 669 కరోనా కేసులు బయటపడ్డాయి.


More Telugu News