హైదరాబాద్ లో ఐపీఎల్ సందడి.. నేడే సన్ రైజర్స్ తొలి పోరు
- ఉప్పల్ స్టేడియంలో నేడు రాజస్థాన్ రాయల్స్ తో ఢీ
- భువనేశ్వర్ కెప్టెన్సీ బరిలోకి హైదరాబాద్
- మధ్యాహ్నం గం. 3.30 నుంచి మ్యాచ్
మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించబోతున్నారు. ఈ రోజు నుంచి భాగ్యనగరంలో ఐపీఎల్ సందడి మొదలవనుంది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ తో ఈ సీజన్ ను ఆరంభించనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరుసగా రెండుసార్లు ఎనిమిదో స్థానంతో సరిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రమంలో తమ జట్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంది. డజను మంది ఆటగాళ్లను మార్చేసింది. సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్ క్రమ్ కు కెప్టెన్సీ అప్పగించింది. మరి ఈసారైనా జట్టు రైజింగ్‌లోకి వస్తుందా? లేదా? అన్నది చూడాలి. అయితే, తొలి మ్యాచ్ కు మార్ క్రమ్ అందుబాటులో ఉండటం లేదు. దాంతో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక, 2022 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్, రాజస్థాన్ జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగ్గా చెరో ఎనిమిది మ్యాచ్ లు గెలిచి సమానంగా ఉన్నాయి.