కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ
- చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస వదిలిన సీనియర్ నటుడు
- భారత్ బంద్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం
- పెళ్లిపందిరి సినిమాతో నిర్మాతగా మారిన కాస్ట్యూమ్ కృష్ణ
సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ ఆదివారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస వదిలారు. కాస్ట్యూమ్ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. పెళ్లి పందిరి సినిమాను నిర్మించడంతో పాటు అందులో నటించారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాస్ట్యూమ్ కృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ నిర్మాత దిల్ రాజు ట్వీట్ చేశారు.
సినీ రంగంలో అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన కృష్ణ.. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాలను నిర్మించడంతో పాటు పలు చిత్రాలలో విలన్ గా, సహాయక నటుడిగా పాత్రలు పోషించారు. పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి తదితర సినిమాలలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు.