సీఎం జగన్ ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలి: బొండా ఉమ

సీఎం జగన్ ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలి: బొండా ఉమ
  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన బొండా ఉమ
  • 98 శాతం హామీలు ఎక్కడ నెరవేర్చారో చెప్పాలని డిమాండ్
  • నవరత్నాల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శలు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలని వ్యంగ్యం ప్రదర్శించారు. 98 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్నారని, ఎక్కడ నెరవేర్చారో చెప్పాలని నిలదీశారు. 15 లక్షల మందికి పెన్షన్ డబ్బులు ఎగ్గొట్టారని, విద్యుత్ చార్జీల పెంపుతో రూ.57 వేల కోట్లు రాబట్టారని బొండా ఉమ వివరించారు. ఆఖరికి ఉద్యోగుల డబ్బులు కూడా లూటీ చేశారని వివరించారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో కట్టింది ఐదు ఇళ్లేనని పార్లమెంటులో నిరూపితమైందని అన్నారు. నవరత్నాల్లో ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని బొండా ఉమ విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ప్రజలను ఫూల్స్ ని చేస్తూనే ఉన్నాడని వివరించారు.


More Telugu News