తొలి మ్యాచ్ గెలిచిన గుజరాత్ కు షాక్.. గాయంతో కేన్ మామ ఐపీఎల్ నుంచి ఔట్!
- చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ లో టైటాన్స్ ఘన విజయం
- ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కేన్ విలియమ్సన్
- మోకాలికి తీవ్ర గాయం అయిందని వైద్యుల గుర్తింపు!
సొంతగడ్డపై ఘన విజయంతో ఐపీఎల్ 16వ సీజన్ ను ఆరంభించిన ఆనందంలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈ సీజన్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.
అహ్మదాబాద్ లో నిన్న రాత్రి జరిగిన తొలి పోరులో టైటాన్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. చెన్నై ఇన్నింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్సర్ ను ఆపే ప్రయత్నంలో బౌండ్రీ లైన్ వద్ద డైవ్ చేసిన కేన్ కుడి మోకాలికి గాయం అయింది. నొప్పితో విలవిల్లాడిన కేన్ కనీసం నడవ లేకపోయాడు. సహాయ సిబ్బంది తమ భుజాలపై అతడిని బయటికి తీసుకెళ్లారు. అతను తిరిగి గ్రౌండ్ లోకి రాలేదు. కేన్ స్థానంలో టైటాన్స్ సాయి సుదర్శన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ లో ఆడించింది.
కాగా, వైద్య పరీక్షల తర్వాత కేన్ విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయం అయ్యిందని తెలిపింది. మోకాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. దీనికి కనీసం 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విశ్రాంతి అవసరం.
కేన్ మోకాలికి అయిన గాయం చాలా తీవ్రమైందని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ కిర్ స్టన్ చెప్పాడు. తర్వాతి మ్యాచుల్లో ఆడే పరిస్థితి కష్టమమేనన్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మొత్తానికే కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. గతేడాది వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్ ను వేలంలో గుజరాత్ కొనుగోలు చేసింది. కానీ, ఎంతో అనుభవం ఉన్న అతను తొలి మ్యాచ్ లోనే గాయపడటం టైటాన్స్ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది.