తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్!

  • నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామన్న షర్మిల
  • ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచన
  • కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వ్యాఖ్య
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని రేవంత్, సంజయ్ కి చెప్పారు.

నిరుద్యోగుల సమస్యలు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని అభిప్రాయపడ్డారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల అన్నారు.

షర్మిలకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు త్వరలో సమావేశమవుదామని చెప్పారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ బదులిచ్చారు.


More Telugu News