ఉపాధి హామీ కూలీలకు దినసరి కూలీని పెంచిన కేంద్రం
- రోజువారీ కూలీ పెంచిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ
- తెలంగాణ, ఏపీలో రూ.15 పెంచి రూ. 272 గా ఖరారు
- హర్యానాలో అత్యధికంగా రూ. 357 కూలీ
ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూలీ డబ్బులను పెంచింది. ఈ ఏడాది చెల్లించనున్న దినసరి కూలీని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూలీ రేటును ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు కూలీ రేట్లను రోజుకు రూ.272 ఖరారు చేసింది. గతేడాది ఏప్రిల్ నాటికి ఉపాధి కూలీలకు తెలంగాణలో చెల్లిస్తున్న రోజు వేతనం రూ.257 కాగా, తాజాగా రూ.15 పెరిగింది.
మరోవైపు ఈ పథకంలో అత్యధికంగా హర్యానాలో కూలీ రేటు రూ.357గా ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో అత్యల్పంగా రూ.221గా కేంద్రం ఖరారు చేసింది. ఈ మేరకు 2013లో చేసిన చట్టంలో పలు సవరణలు చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు శనివారం నుంచి అమల్లో రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.