థ్యాంక్స్ .. చిన్న సినిమాకి పెద్ద సక్సెస్ కట్టబెట్టారు: హీరో రాజ్ కార్తికేన్
- రాజ్ కార్తికేయన్ హీరోగా వచ్చిన 'రాజ్ కహానీ'
- కథానాయికగా చంద్రిక అవస్తి పరిచయం
- సంగీతాన్ని అందించిన మహిత్ నారాయణ్
- మహిళా ప్రేక్షకుల ఆదరణ బాగుందన్న మేకర్స్
భార్గవి క్రియేషన్స్ పతాకంపై మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రమే 'రాజ్ కహానీ'. రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. మహిత్ నారాయణ్ (చక్రి తమ్ముడు) సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం, థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
ఈ సందర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నిర్మాత రమేష్ పుప్పాల, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, లయన్ సాయివెంకట్, తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ..చిన్న సినిమా అయినా కథలో మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా బిగ్ హిట్ అవుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన ఈ 'రాజ్ కహానీ' సినిమాను మనమందరం ప్రోత్సహించి బిగ్ హిట్ చెయ్యాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఇంకా మంచి చిత్రాలు తీస్తారు" అంటూ చిత్ర యూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
చిత్ర దర్శకుడు - హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ .. "మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నేను, ఈ కథ రాసుకుని గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది నిర్మాతలకు వినిపించడం జరిగింది. ఎవరూ తీయడానికి ముందుకు రాకపోవడంతో చివరకు నేనే ఫ్రెండ్స్ .. ఫ్యామిలీ సపోర్ట్ తో స్టార్ట్ చేశాను. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ చాలా బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మహిళలు అందరూ తల్లి కొడుకుల సెంటిమెంట్ బాగుందని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది" అని అన్నాడు.