దేశ విభజన పొరపాటున జరిగింది.. పాక్ ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరు: మోహన్ భగవత్

  • అఖండ భారత్ అనేది వాస్తవమన్న మోహన్ భగవత్
  • దేశ విభజన పీడకల అని వ్యాఖ్య
  • స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియాకు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్య
భారతదేశ విభజన పొరపాటున జరిగిందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ విభజన జరిగి ఏడు దశాబ్దాలు దాటిపోయాయని... స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియాకు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారని... పాకిస్థాన్ లోనే ఉండిపోయిన వారు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. భారత్ విభజన పెద్ద పొరపాటని పాకిస్థాన్ ప్రజలే అంటున్నారని తెలిపారు. పాకిస్థాన్ లో బాధ ఉందని అన్నారు. 

అఖండ భారత్ (భారతదేశం, ఆధునిక ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, పాకిస్థాన్, మయన్మార్, నేపాల్, టిబెట్, శ్రీలంకల్లో ఉన్న భాగాలతో కూడిన దేశం) అనేది వాస్తవమని చెప్పారు. విభజించబడిన భారతదేశం ఒక పీడకల అని వ్యాఖ్యానించారు. ఇతరులపై దాడులు చేసే సంస్కృతి భారత్ ది కాదని... అయితే పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూనే ఉంటుందని చెప్పారు. 



More Telugu News