కేజ్రీవాల్ పై సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
- బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పార్కింగ్ లో రూ.15 కోట్లు అందించా!
- ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. వచ్చేవారంలో అన్నీ బయటపెడతా!
- మండోలి జైలు నుంచి సుకేశ్ చంద్రశేఖర్ లేఖ
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ పై కాన్ మాన్ సుకేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతకు రూ.15 కోట్లు అందజేశానని ఆరోపించారు. ఇది కేవలం ఓ ట్రైలర్ మాత్రమేనని, కేజ్రీవాల్ కు తనకు మధ్య జరిగిన వాట్సాప్, టెలిగ్రాం ఛాట్ లకు సంబంధించి 700 పేజీల సమాచారాన్ని వచ్చే వారం బయటపెడతానని తెలిపాడు. ఈమేరకు శుక్రవారం సుకేశ్ చంద్రశేఖర్ మీడియాకు ఓ లేఖ విడుదల చేశాడు. ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పిస్తానంటూ వ్యాపారస్థులను మోసగించిన కేసులో సుకేశ్ ప్రస్తుతం మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఇప్పటికైనా ఆపకుంటే చిక్కుల్లో పడతావని కేజ్రీవాల్ ను సుకేశ్ ఈ లేఖలో హెచ్చరించాడు. కేజ్రీవాల్ అవినీతికి సంబంధించిన చిట్టా మొత్తం తన దగ్గర ఉందని, అదంతా బయటపెడితే ఆప్ అధికార పీఠం కుప్పకూలుతుందని సుకేశ్ చెప్పాడు. త్వరలోనే కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నాడు. కర్ణాటకలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలలన్నీ కల్లలవుతాయని, కేజ్రీవాల్ ఓ జోకర్ గా మిగిలిపోతాడని సుకేశ్ తన లేఖలో వివరించాడు.
హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఓ నేతకు రూ.15 కోట్లు అందజేశానని సుకేశ్ చెప్పాడు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సూచనల మేరకు టీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి సొమ్ము అందించినట్లు తెలిపాడు. ఈ డీల్ మొత్తం కోడ్ వర్డ్స్ లో జరిగిందని, 15 కేజీల ఘీ అంటే రూ.15 కోట్లు అని చెప్పాడు. బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసిన రేంజ్ రోవర్ (నెంబర్ 6060) కారులోని వ్యక్తికి రూ.75 కిలోల ఘీ ఇవ్వాల్సి ఉందని, నీ (సుకేశ్) తరఫున రూ.15 కిలోల ఘీ అందజేయాలని కేజ్రీవాల్ సూచించాడన్నారు. దీని ప్రకారం తాను రూ.15 కోట్లు ఆ కారులో కూర్చున్న వ్యక్తికి అందించినట్లు తెలిపాడు.