ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా ధోనీ!
- నిన్నటికి ధోనీ వయసు 41 సంవత్సరాల 267 రోజులు
- షేన్ వార్న్ రికార్డు బద్దలు
- ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన చెన్నై
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో గత రాత్రి జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ధోనీ వయసు నిన్నటికి 41 సంవత్సరాల 267 రోజులు.
ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్ రికార్డు ఇప్పటి వరకు దివంగత ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ పేరున ఉంది. వార్న్ 41 సంవత్సరాల 249 రోజుల వయసులో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు సారథ్యం వహించాడు. అంతేకాదు, ఆ జట్టుకు తొలి ట్రోఫీ అందించిపెట్టాడు. వార్న్ రికార్డును ఇప్పుడు ధోనీ అధిగమించి అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా తన పేరును రికార్డు పుస్తకాల్లో రాసుకున్నాడు.
కాగా, గత రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 179 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయంతో ఐపీఎల్‌ను ఆరంభించింది.