ఐపీఎల్-16: చెన్నై సూపర్ కింగ్స్ పై టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
- నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్
- ప్రారంభ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టైటాన్స్
- ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే క్రికెట్ పండుగ ఐపీఎల్ మొదలైంది. 16వ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఈ పోరులో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై ఆడనుండడం గుజరాత్ టైటాన్స్ కు అదనపు బలం కానుంది. చెన్నై జట్టులో ధోనీ, జడేజా, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ వంటి స్టార్లు ఉన్నారు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ స్టోక్స్ ఈ సీజన్ లో చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు మ్యాచ్ విన్నర్లతో కళకళలాడుతోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, శుభ్ మాన్ గిల్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, మాథ్యూ వేడ్, మహ్మద్ షమీ తదితరులతో గుజరాత్ జట్టు సమతూకంతో కనిపిస్తోంది.
తెలుగుతేజం కేఎస్ భరత్ ఐపీఎల్ లో ఈసారి గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరో తెలుగు ఆటగాడు అంబటి రాయుడు చెన్నై జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే.