తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీలు మార్పు
- నీట్, టీఎస్ పీఎస్సీ పరీక్షల నేపథ్యంలో షెడ్యూల్ మార్పు
- వాస్తవానికి మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు
- నీట్, టీఎస్ పీఎస్సీ పరీక్షల నేపథ్యంలో షెడ్యూల్ మార్పు
- మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు
నీట్, టీఎస్ పీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పు చేశారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
అదే సమయంలో, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు మే 10, 11 తేదీల్లో జరగనున్నాయి.
కాగా, మే 2వ తేదీ వరకు లేట్ ఫీజుతో ఎంసెట్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.