మహిళా క్రికెటర్ అద్భుత విన్యాసం.. ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా!
- ఓ మ్యాచ్ లో బంతిని ఆపేందుకు డైవ్ చేసిన మహిళా క్రికెటర్
- వీడియోను షేర్ చేసిన మహీంద్రా
- అలా ఎఫర్ట్ అంతా పెట్టి ప్రయత్నించాలని సూచన
మోటివేషనల్ కొటేషన్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. టాలెంట్ ను ప్రోత్సహిస్తారు. మట్టిలో మాణిక్యాలు కనిపిస్తే ఉత్సాహపరుస్తారు. ఓ ట్వీట్ చేసి వైరల్ కూడా చేస్తారు.
తాజాగా మరో వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారాయన. టీ20 మ్యాచ్ లో బౌండరీ లైన్ చివర్లో బంతిని ఆపేందుకు మహిళా క్రికెటర్ చేసిన ప్రయత్నం అందులో కనిపించింది. బంతి వెంట బౌండరీ దాకా పరిగెత్తిన ఆమె.. ఫోర్ వెళ్లకుండా ఆపేందుకు చేసిన విన్యాసం నిజంగా అద్భుతంగా ఉంది. అదే మహీంద్రాని అబ్బురపరిచింది.
వీడియోను ట్వీట్ చేసిన ఆయన.. ‘‘మీరు ఆడేందుకు వెళ్తుంటే.. మీ దగ్గర ఉన్న ఎఫర్ట్ అంతా పెట్టండి. సగం చర్యలు సరిపోవు’’ అని క్యాప్షన్ ఇచ్చారు. నిబద్ధతతో, పూర్తి ఎఫర్ట్ తో ప్రయత్నించాలని పరోక్షంగా ఆయన మెసేజ్ ఇచ్చారు. ‘ఫ్రైడే ఫీలింగ్’ అనే హాష్ ట్యాగ్ ను జత చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మహీంద్రా మెచ్చిన ఆ స్ఫూర్తిదాయక వీడియోను మీరూ చూసేయండి.