పదవి నుంచి తొలగిస్తారన్న దానిపై నాకు సమాచారం లేదు: సీదిరి అప్పలరాజు
- సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి పిలుపు
- కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటీన వచ్చిన మంత్రి
- మంత్రి పదవి కంటే తనకు ప్రజాసేవే ముఖ్యమని వెల్లడి
- తన దృష్టిలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ మంత్రులేనని వివరణ
ఏపీలో మరోసారి క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుందన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుత మంత్రివర్గం నుంచి కొందరిని తప్పిస్తారని కథనాలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజుకు ఇవాళ సీఎం కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన పనులన్నీ ఆపుకుని హుటాహుటీన తాడేపల్లి చేరుకున్నారు.
తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవి నుంచి తొలగిస్తారన్న దానిపై తనకు సమాచారం లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవి కంటే తనకు ప్రజాసేవే ముఖ్యమని అన్నారు. తన దృష్టిలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ మంత్రులేనని పేర్కొన్నారు. బీసీల నుంచి వచ్చిన తనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారని వెల్లడించారు.
సీదిరి అప్పలరాజు ఏపీ క్యాబినెట్ లో మత్స్య, పాడి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు.