స్టేడియం మీ ఇంటికే వస్తుంది... డాల్బీ అట్మోస్ సౌండ్ తో ఐపీఎల్ ప్రసారాలు
- నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్
- టెలివిజన్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి
- డాల్బీ 5.1.4 సౌండ్ తో స్టార్ స్పోర్ట్స్ ప్రసారాలు
- మీ టీవీ డాల్బీని సపోర్ట్ చేస్తే స్టేడియం మీ ఇంట్లోనే!
- ఇంకా పలు ఇంటరాక్టివ్ ఫీచర్లను తీసుకువస్తున్న స్టార్ స్పోర్ట్స్
ఐపీఎల్-2023 అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ఈ సీజన్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బుల్లితెర వీక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. ఐపీఎల్ మ్యాచ్ ల ప్రసారాలకు డాల్బీ అట్మోస్ సౌండ్ ను జోడించనుంది.
అద్భుతమైన శబ్ద నాణ్యతకు, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కు తిరుగులేని చిరునామా డాల్బీ. డాల్బీలో ఇప్పుడు అట్మోస్ టెక్నాలజీ లేటెస్ట్ వెర్షన్. ఇప్పుడొస్తున్న అనేక సినిమాలు ఈ ఫార్మాట్లోనే ఉంటున్నాయి. డాల్బీ అట్మోస్ లో 5.1.4 కాన్ఫిగరేషన్ తో ధ్వనులను అత్యంత స్పష్టంగా వినొచ్చు. ఇప్పుడు ఐపీఎల్ ప్రసారాల్లోనూ ఈ టెక్నాలజీని వినియోగించాలని స్టార్ స్పోర్ట్స్ నిర్ణయించింది.
డాల్బీ సౌండ్ ఫీచర్ కలిగివున్న టీవీల్లో ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తుంటే స్టేడియంలోని ప్రేక్షకుల హోరును మన ఇంటి వద్దే అనుభూతి చెందవచ్చు. ఈ తరహా సినిమాటిక్ సౌండ్ ను డాల్బీ అట్మోస్ అందిస్తుంది.
అంతేకాదు, ఐపీఎల్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ చానల్ డీటీహెచ్ ప్రొవైడర్లతో కీలక భాగసామ్యం ద్వారా క్రికెట్ అభిమానులకు ఇంటరాక్టివ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎయిర్ డిజిటల్ టీవీ డీటీహెచ్ కలిగివున్న వారు తమ రిమోట్ లో 'రెడ్ బటన్' నొక్కితే స్టార్ స్పోర్ట్స్ ప్రొ ఫీచర్ పొందవచ్చు దీని ద్వారా రియల్ టైమ్ హైలైట్స్, మ్యాచ్ స్టాటిస్టిక్స్ అప్పటికప్పుడే పొందవచ్చు.
టాటా ప్లే డీటీహెచ్ కలిగివున్న వారు రిమోట్ లో 'సైడ్ బటన్' ను నొక్కడం ద్వారా ఈ ఇంటరాక్టివ్ సదుపాయాలు అందుకోవచ్చు. అంతేకాదు, మ్యాచ్ జరుగుతున్నప్పుడే స్టేడియంలో ప్రేక్షకుల హోరును ఆస్వాదించే క్రమంలో కామెంటరీ వద్దనకుంటే ఆఫ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. దాంతోపాటే, లైవ్ మ్యాచ్ ను సబ్ టైటిల్స్ సాయంతో సినిమాలాగా చూడొచ్చు. కృత్రిమ మేధ సాయంతో స్టార్ స్పోర్ట్స్ ఈ ఫీచర్లను తాజా ఐపీఎల్ ద్వారా వీక్షకులకు అందించనుంది.
ఇవే కాకుండా సోషల్ లిజనింగ్ టూల్ (రియల్ టైమ్ ఫాన్ పోలింగ్), అన్ని యాంగిల్స్ లో మ్యాచ్ ను వీక్షించేలా ఎక్సీబ్రా క్వాడ్ రీప్లే, వీఆర్ ఇమ్మెర్సివ్ క్రికెట్ గేమ్, హాక్ ఐ 3డీ కటౌట్స్ వంటి ఇతర టెక్నో ఫీచర్స్ కూడా స్టార్ స్పోర్ట్స్ ప్రవేశపెడుతోంది.