అమెరికా విదేశాంగ శాఖలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
- విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీ ఆఫ్ స్టేట్‌గా రిచర్డ్ వర్మ ఖరారు
- రిచర్డ్ అభ్యర్థిత్వానికి సెనెట్ ఆమోదం
- ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సంస్థ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా ఉన్న రిచర్డ్
- గతంలో భారత్‌లో అమెరికా రాయబారిగా కూడా సేవలు
అమెరికా ప్రభుత్వంలో తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి దక్కింది. గతంలో భారత్‌కు రాయబారిగా బాధ్యతలు నిర్వహించిన రిచర్డ్ వర్మకు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ పదవి ఖరారైంది. విదేశాంగ శాఖలో కీలకమైన ఈ పోస్టును ఆ శాఖ సీఈఓ పదవిగా భావిస్తుంటారు. రిచర్డ్ అభ్యర్థిత్వానికి అమెరికా పెద్దల సభ సెనెట్ 67-26 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.
రిచర్డ్ ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సంస్థలో చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా, సంస్థ గ్లోబల్ పాలసీ విధానానికి ప్రధాన అధికారిగా ఉన్నారు. 2015-17 మధ్య కాలంలో ఆయన భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేశారు. అంతేకాకుండా.. ఓబామా హయాంలో లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్‌గా కూడా పనిచేశారు. తన కెరీర్ తొలినాళ్లలో సెనెటర్ హ్యారీడ్‌కు విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా కూడా పనిచేశారు.