రూ.8 లక్షల లోపు ఖరీదులో బెస్ట్ ఎస్యూవీ కార్లు ఇవే!
- కరోనా తర్వాత పెరిగిన కార్ల అమ్మకాలు
- కార్ల అమ్మకాలలో 40 శాతం వాటా ఎస్యూవీలదే!
- సొంత వాహనాల్లో ప్రయాణించేందుకే ఇష్టపడుతున్న జనం
ఒకప్పుడు లగ్జరీ వస్తువుగా భావించిన కారు ఇప్పుడు చాలా మందికి తప్పనిసరి అవసరంగా మారింది. కరోనా తర్వాత సొంత వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారి సంఖ్య పెరిగింది. దీంతో కార్ల కొనుగోళ్లు పెరిగాయి. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి అనువైన కార్లనే ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. దూర ప్రయాణాలకు ఎస్యూవీలు సౌకర్యవంతంగా ఉండడంతో వీటి సేల్స్ పెరిగాయి. ఆటోమొబైల్ రంగంలో దీని ప్రభావం కనిపిస్తోంది. కార్ల అమ్మకాలలో ఒక్క ఎస్యూవీల వాటానే 40 శాతంగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.8 లక్షల లోపు ఖరీదులో బెస్ట్ ఎస్యూవీ కార్ల వివరాలు..
టాటా పంచ్ :
టాటా మోటార్స్ కంపెనీ నుంచి ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కారు టాటా పంచ్.. హ్యాచ్ బ్యాక్ టియాగో కారు మోడల్ లో, అదే ధరల శ్రేణిలో మార్కెట్ లోకి విడుదలైన ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షలు. ఒకే ఇంజన్ తో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ తో అందుబాటులో ఉంది.
నిస్సాన్ మాగ్నైట్ :
నిస్సాన్ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కారు ఇది. మార్కెట్లో అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉన్న ఎస్యూవీగా పేరొందింది. నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ షోరూం ధర రూ. 5.99 లక్షలు. నిస్సాన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మాగ్నైట్‌ను అందిస్తోంది, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ లతో వస్తోంది.
రెనాల్ట్ కైగర్ :
మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ ఎస్యూవీలలో రెనాల్ట్ కైగర్ ఒకటి. రెనాల్ట్ కంపెనీ తయారుచేసిన ఈ మోడల్ ఖరీదు రూ.6.49 లక్షలు (ఎక్స్ షోరూం ధర). 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటీ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. మరో ఇంజన్ విషయానికి వస్తే.. 1.0 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ :
ఎస్యూవీలలో కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ వెన్యూ మోడల్ ఒకటి.. మూడు ఇంజన్ ఎంపికలతో వస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ.7.68 లక్షలు (ఎక్స్ షోరూం). ఈ కారు 114.41 బీహెచ్ పీ, 250 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ల డీజిల్ ఇంజన్, 81.86 బీహెచ్ పీ, 114 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ బి21 ఇంజన్.
కియా సోనెట్ :
హ్యుందాయ్ వెన్యూ లాంటి ఇంజన్ ఎంపికలతో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎస్యూవీ కియా సోనెట్.. దీని ధర రూ.7.79 లక్షలు (ఎక్స్ షోరూం ధర). ఈ ఎస్యూవీలో ఇంజన్‌లు 81.86 బీహెచ్ పీ, 114 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 114.41 బీహెచ్ పీ, 250 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ల డీజిల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్.