బాబోయ్! ఒడిశాలో పిడుగుల వాన.. అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

  • భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో ఘటన
  • పిడుగుపాటు శబ్దాలతో జనం బెంబేలు
  • క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలానే జరుగుతుందన్న అధికారులు
ఒడిశాలో పిడుగుల వాన కురిసింది. అరగంటపాటు ఏకధాటిగా కురిసిన పిడుగులతో జనం బెంబేలెత్తిపోయారు. తెరిపిలేకుండా పడిన పిడుగుల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం జరిగిందీ ఘటన. 

అరగంట వ్యవధిలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. ఆగకుండా వస్తున్న పిడుగుపాటు శబ్దాలకు ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే, ఇలా జరగడం కొత్తేమీ కాదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారులు చెబుతున్నారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని అన్నారు. 

కాగా, సుందర్‌గఢ్, కియోంజర్, సుందర్‌గఢ్, మయూర్‌భంజ్, బాలాసోర్, కటక్ సహా పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో బలమైన గాలులు, పిడుగు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.


More Telugu News