ప్రపంచంలో ఉత్తమ ఫీల్డర్ ఎవరో చెప్పిన జాంటీ రోడ్స్
- జడేజా గొప్ప ఫీల్డర్ అని అభిప్రాయపడ్డ జాంటీ రోడ్స్
- తన అభిప్రాయం ప్రకారం మరింత మంది ఫీల్డింగ్ కోచ్ లు అవసరమన్న రోడ్స్
అంతర్జాతీయ క్రికెట్ లో ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్ ఎవరని అడిగితే అందరికీ గుర్తొచ్చే తొలి పేరు జాంటీ రోడ్స్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ క్రికెటర్ తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ లతో మంత్రముగ్దుల్ని చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత క్రికెట్ లో అద్భుతమైన ఫీల్డర్ ఎవరో చెప్పాడు. ఆ అద్భుత ఫీల్డర్ ఎవరో కాదు... టీమిండియా ఆల్ రౌండర్ జడేజా.
ప్రస్తుతానికి ప్రపంచంలో గొప్ప ఫీల్డర్ జడేజా అని జాంటీ రోడ్స్ చెప్పాడు. ఫీల్డింగ్ విభాగం మెరుగు పడటానికి ఐపీఎల్ కూడా ఒక కారణమని అన్నాడు. ఐపీఎల్ ప్రారంభం కాగానే అన్ని ఫ్రాంఛైజీలు ఫీల్డింగ్ పై దృష్టి సారిస్తాయని చెప్పాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ప్రతి సీజన్ లో తాను 12 నుంచి 13 మంది బెస్ట్ ఫీల్డర్లను చూశానని తెలిపాడు. తన అభిప్రాయం ప్రకారం మరింత మంది ఫీల్డింగ్ కోచ్ లు అవసరమని చెప్పాడు. ఐపీఎల్ లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న సంగతి తెలిసిందే.