నో బ్యాగ్ డే.. విద్యార్థులు ఏమేం తీసుకెళ్లారో మీరే చూడండి!
- చెన్నైలో విద్యార్థులతో ఫన్ యాక్టివిటీ నిర్వహించిన కాలేజీ
- ‘నో బ్యాగ్ డే’ ప్రకటన.. వినూత్నంగా జరుపుకున్న అమ్మాయిలు
- బకెట్లు, కుక్కర్లు, సూట్ కేసులతో రాక.. ఇన్ స్టాలో వీడియో వైరల్
- తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు
అది చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కాలేజీ (డబ్ల్యూసీసీ). విద్యార్థులతో ఓ ఫన్ యాక్టివిటీని కాలేజీ యాజమాన్యం నిర్వహించింది. కాలేజీలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’ అని ప్రకటించింది. అంటే బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. దీంతో అమ్మాయిలు పండుగ చేసుకున్నారు. నో బ్యాగ్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.
చాన్స్ దొరికిందని అమ్మాయిలు తమ క్రియేటివిటీని బయటపెట్టారు. పుస్తకాలు తప్ప మిగతావన్నీ కాలేజీకి పట్టుకొచ్చారు. కొందరైతే ప్రెషర్ కుక్కర్లు తీసుకొచ్చారు. ఇంకొందరు బకెట్లు, సూట్ కేస్ లు, లాండ్రీ బాస్కెట్స్, షూ బాక్స్‌లు వంటివి కాలేజీకి తెచ్చారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. 17 లక్షల మందికి పైగా చూశారు. 1.3 లక్షల మంది లైక్ కొట్టారు. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు.
విద్యార్ధినుల సృజనాత్మకతను ఇన్‌స్టా యూజర్లు ప్రశంస్తున్నారు. ఐడియా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘అండ్ ది అవార్డు గోస్ టు బకెట్ గర్ల్’ అంటూ చమత్కరిస్తున్నారు. ఇంకొందరు తమ కాలేజీ రోజులను గుర్తుతెచ్చుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం వీడియో మీరూ చూసేయండి!
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి