శ్రీరాముడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తి: మోదీ
- శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
- శ్రీరాముని మహోన్నతమైన ఆశయాలను అలవర్చుకోవాలన్న ముర్ము
- నేడు దేశవ్యాప్తంగా రామనవమి సంబరాలు
శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. ‘రామ నవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పురుషోత్తముడైన శ్రీరాముడి జీవితం నుంచి త్యాగం, సేవ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందుకున్నాం. దేశ ప్రజలందరూ శ్రీరాముని మహోన్నతమైన ఆశయాలను అలవర్చుకుని ఉజ్వల భారతదేశ నిర్మాణానికి పూనుకోవాలని నా కోరిక’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
‘రామ నవమి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. త్యాగం, కాఠిన్యం, సంయమనం, సంకల్పం ఆధారంగా మర్యాద పురుషోత్తమ భగవానుడు రామచంద్రుడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.