భద్రాద్రి రామయ్య కల్యాణానికి 8 కేజీల గోటి తలంబ్రాలు!

  • నేడు శ్రీరామ నవమి
  • శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు
  • గోటి తలంబ్రాలు అందించిన అనంత పద్మనాభ కోలాట భక్తబృందం
శ్రీరామ నవమిని పురస్కరించుకుని నేడు భద్రాద్రి రామయ్య కల్యాణం కనుల పండువలా జరగనుంది. సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సీతారాముల పరిణయ వేడుకలో ఖమ్మం నగరానికి చెందిన అనంత పద్మనాభ కోలాట భక్తబృందం అందించిన 8 కేజీల గోటి తలంబ్రాలను ఉపయోగించనున్నారు. పతకముడి లక్ష్మి సారథ్యంలోని బృందం సభ్యులు తలంబ్రాల కోసం మంగళగూడెంలో ప్రత్యేకంగా వరి పండించారు. 

మొత్తం 50 కిలోల వడ్లు రాగా, వాటిని రఘునాథపాలెం, వీఆర్‌బంజర, చింతపల్లి, కోయచెలక, రేగులచెలక, గణేశ్వరం, కోటపాడు, భయన్నపాడు, ఆంధ్రప్రదేశ్‌లోని గూడవల్లి, చెరుకుపల్లి గ్రామాలకు ఉచితంగా పంచిపెట్టారు. అలాగే, గోటితో ఒలిచిన 8 కిలోల తలంబ్రాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సమర్పించారు. రాములోరి కల్యాణంలో ఈ గోటి తలంబ్రాలను ఉపయోగిస్తారు.


More Telugu News