ఏఈఈ పరీక్ష కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
- టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీక్ కలకలం
- పలు పరీక్షల రద్దు
- జనవరి 22న జరిగిన ఏఈఈ పరీక్ష కూడా రద్దు
టీఎస్ పీఎస్సీలో పలు ప్రశ్నా పత్రాలు లీక్ అవడం ఇటీవల సంచలనం సృష్టించింది. లీక్ అయిన పేపర్లలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగ నియామకాల పరీక్ష ప్రశ్నాపత్రం కూడా ఉంది. వాస్తవానికి ఏఈఈ పరీక్ష జనవరి 22నే నిర్వహించారు. పేపర్ లీక్ కారణంగా ఈ పరీక్షను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. ఇప్పుడు ఈ పరీక్షకు కొత్త తేదీలు ప్రకటించారు.
ఏఈఈ పరీక్షల నూతన తేదీలు...
మే 8- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్)
మే 9- అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్)
మే 21- సివిల్ ఇంజినీరింగ్ (ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్)
మే 9- అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ (కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్)
మే 21- సివిల్ ఇంజినీరింగ్ (ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్)