స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 40 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 34 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 2.90 శాతం పతనమైన టెక్ మహీంద్రా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రాంరభమైన వెంటనే లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఒక గంట వ్యవధిలోనే నష్టాల్లోకి మళ్లాయి. ఆ తర్వాత ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు చివరకు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 40 పాయింట్లు కోల్పోయి 57,613కి పడిపోయింది. నిఫ్టీ 34 పాయింట్లు పతనమై 16,951 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.20%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.94%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.83%), హెచ్డీఎఫ్సీ (0.68%),
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.90%), టాటా మోటార్స్ (-2.46%), భారతి ఎయిర్ టెల్ (-1.94%), విప్రో (-1.40%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.29%).