ఇది ట్రైలర్ మాత్రమే... అసలైన సినిమా ముందుంది: కేటీఆర్
- గత ఏడాది 1.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్న కేటీఆర్
- పిట్ట కథలు చెపితే పెట్టుబడులు రావని వ్యాఖ్య
- వ్యాక్సిన్ నగరంగా హైదరాబాద్ ఖ్యాతి గడించిందన్న కేటీఆర్
గత ఏడాది తెలంగాణలో కొత్తగా 1.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫెడ్ ఎక్స్ సంస్థే ఏడు వేల ఉద్యోగాలను సృష్టించిందని చెప్పారు. 2021లో లైఫ్ సెన్సెస్ సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లని... ఇది 2030కి 250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. 103 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో రెండు రిజర్వాయర్లు కట్టారని... నగరానికి అతిపెద్ద నీటి వనరు మూసీ నది అని చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రతి సినిమాలో దుర్గం చెరువు కనిపిస్తోందని... ఇది సంతోషకర విషయమని చెప్పారు. హైదరాబాద్ లో ఫాక్స్ కాన్ సంస్థ 200 ఎకరాల్లో యూనిట్ పెడుతోందని తెలిపారు.
విదేశాల నుంచి వస్తున్న వారంతా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని చెపుతున్నారని కేటీఆర్ అన్నారు. నగరంలోని 50 చెరువులను అభివృద్ధి చేస్తామని పెద్ద కంపెనీలు కూడా ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. చెరువుల్లో పట్టా భూములు కూడా ఉన్నాయని... ఇలాంటి భూములను సేకరించి టీడీఆర్ లు ఇచ్చామని తెలిపారు. కట్టు కథలు, పిట్ట కథలు చెబితే పెట్టుబడులు రావని అన్నారు. వ్యాక్సిన్ నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని సంపాదించిందని చెప్పారు. వచ్చే ఏడాది 1400 కోట్ల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు మనం సాధించిందంతా ట్రైలర్ మాత్రమేనని... అసలైన సినిమా ముందుందని చెప్పారు.